పెద్ద కథలు »
   
 

అనగనగా ఒక అడవిప్రాంతంలో ఆత్మానందుని ఆశ్రమం ఉండేది. ఆత్మానందుడు ఒక గొప్పపండితుడు.  తన వద్ద కు విద్యకోసం వచ్చే వారెవరైనా సరే తన ఆశ్రమంలోచేర్చుకుని విద్యాబోధచేసేవాడు. వారి కులగోత్రాల గురించీ ఎన్నడూ అడిగేవాడు కాదు. ఒక మారు అతడి ఆశ్రమానికి 8, 9 ఏళ్ళవయస్సున్న ఒక బాలుడు వచ్చాడు. అతడి ఒళ్ళు మట్టి కొట్టుకుని అమిత మురికిగా ఉంది.నల్లగాఉన్నాడు. జుట్టు అట్టలు కట్టి ఉంది.మొలకు ఒక గోచీ గుడ్డ తప్ప మరేమీ లేదు. అతడ్ని చూసి రావి

చెట్టుక్రింద శ్లోకాలు పఠిస్తున్న బాలురంతా ఫక్కున నవ్వుతారు. ఆత్మానందుడు వారికేసి కోపంగా చూసి,ఆబాలుని దగ్గరగా రమ్మని పిలుస్తాడు . అతడు ఆత్మానందుని దగ్గరగా వచ్చి ,ఆయన పాదాలకునమస్కరించి " దేవా! నేను అనాధను. తల్లి తండ్రీ ఎవరో తెలీదు. అంతానన్ను 'అనాధా! ' అనిపిలిస్తారు.ఏదో ఒక పని చెప్పి, చేస్తే ఇంతన్నం పెడితే తినేవాడిని. నాకు విద్య నేర్చుకోవాలనికోరిక.నాకు విద్యా దానం చేస్తారా? మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను." అని చేతులు జోడించిప్రార్ధిస్తాడు.

అతడి వినయ విధేయతలకు ఆనందించిన ఆత్మానందుడు ,వెంటనే అతడ్ని ఆదరించి, పక్కనే ఉన్ననదికి వెళ్ళి స్నానం చేసిరమ్మని పంపుతాడు.  అక్కడికెళ్ళిన ఆబాలునికి అక్కడబట్టలు ఉతుకుతున్న ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది. ఆమె ముదుసలి , వంగి బట్టలు ఉతకను చాలాఇబ్బందిపడుతుంటుంది. వెంటనే ఆబాలుడు " అమ్మా! నేను మీకు సాయం చేయవచ్చా?" అనిఅడుగుతాడు.దానికామె తల ఊస్తుంది. ఆబాలుడు ఆబట్టలన్నీ గబగబా శుభ్రంగా ఉతికి పక్కనే ఉన్నచెట్లకు కట్టి ఆరబెడ తాడు.  ఆతర్వాత నది లోకి దిగి శుభ్రంగా తన వంటి మన్ను , జుట్టుకున్న మురికీవదిలే లాగా  స్నానం చేసి బయటికి రాగానే ఆస్త్రీమూర్తి అప్పటికే ఆరి ఉన్న  రెండు అంగవస్త్రాలు ఇచ్చి"నాయనా! ఇవి వాడుకో " అని చెప్పి, ఆరిన ఆ బట్టలన్నీ మూటకట్టుకుని తీసుకుని వెళు తుంది.ఇలాఅడక్కుండానే సేవచేసి,ఆమె ఇచ్చిన  వస్త్రాలు ధరించి, ఆశ్రమానికి వస్తాడు ఆబాలుడు. 

ఆపాటికే అంతా భోజనాలకు కూర్చునుంటారు."వినయా! ఇలావచ్చి నాపక్కనే కూర్చో!"  అంటూ ఆత్మానందులు పిలుస్తారు. ఆయన ఎవర్నో పిలుస్తున్నారని ఆబాలుడు భావి స్తాడు."నిన్నే వినయా! నీ పేరదేఇహమీదట.! రా నాయనా!" అంటూ మరలా పిలవగానే ఆబాలుడు వెళ్ళి కూర్చుంటాడు. అలా వాని పేరువినయుడై , గురువు బోధించేపాఠాలు మనస్సులో మననం  చేసుకుంటూనే ఆశ్రమ పనులు ఎవ్వరూ చెప్పకుండానే చేస్తూ , ఆశ్రమ పరి శుభ్రత, ఎండుకట్టెలు వంటకోసం సేకరించడం, కూర పాదులు పెట్టి వాటినిచూడటం,ఇంకా అందరికీ అవసరమైన ఇతర పనులన్నీ చేసేవాడు. మిగతా శిష్యులంతా చెట్టుక్రిందకూర్చుని పాఠాలు వల్లెవేస్తుండగా , నయుడు మాత్రం ఆశ్రమ కార్యక్రమాలు చేస్తూ వల్లెవేసేవాడు.రాత్రులు అడవి లోకి వెళ్ళి తనకు వచ్చిన విలువిద్య అభ్యశిస్తూ ఉండే వాడు.

ఆత్మానందుడు ఇదిగమనించి అతడి అభ్యసనానికి ఆనందించేవాడు.అంతా వాడ్ని "ఓయి పనివాడా ! పాఠాలువచ్చాయా!లేక తిననే వచ్చావా!"అని వేళా కోళం చేసేవారు. " మాబట్టలూ ఉతికి పెడతావా?" అని నవ్వేవారు. దేనికీ అతడు చలించక చిఱునవ్వుతో తనపాటికి తాను పనులు చేస్తూ, పాఠాలు వల్లెవేసుకుంటూ,మిగతా వారితో పాటుగా విద్యార్జనలోనూ అందరికంటే ముందుండసాగాడు.అలా కొన్ని సంవత్సరాలుగడిచాయి. విద్యార్ధులంతా  యువకులుయ్యారు. 

గురువుగారు ఒకమారు రాజుగారి ఆహ్వానం మేరకు రాజధానికి వెళ్ళవలసి వచ్చి," వినయా! నేనువచ్చే వరకూ ఆశ్రమ నిర్వహణా కార్య క్రమాలు ,ఆశ్రమ రక్షణాకూడా నీవే చూడు, నేను వచ్చే వరకూ నీవే ఆశ్రమానికి నాయకుడవు, రక్షకుడవూ." అని చెప్పివెళతాడు. అందరికీ ఇదికంట కింపు ఐంది. 'ఎంతో కాలంగా వీనికంటే ముందువచ్చిన మన కంటేఈ అనాధ, గురువుగారికి ఎక్కువయ్యాడు.' అని అంతా అసూయ చెందారు. 

ఆరాత్రి  ఒక పెద్దపులి అడవిలో దారితప్పి ఆశ్రమంలో ప్రవేశించి పెద్దగా అరవగానే అంతా భయంతో వణుకుతూ లోపలికి పరుగెడతారు.ఆశ్రమరక్షణ  తనపై ఉన్నందున వినయుడు తనకు ప్రావీణ్య మున్న విలు విద్యతో దూరం నుంచేబాణం, వేసి ఆ పెద్దపులికాళ్ళకు నాటి అదిపడ్డాక దాన్ని త్రాళ్లతో కట్టేస్తాడు .బలమైన అతడి శరీరానికీ, మనస్సుకూ  భయమన్నది తెలీదు. దానికి కావ ల్సిన ఆహారాన్ని అందిస్తూ గురువుగారు వచ్చే వరకూదాన్ని ప్రాణాలతో ఉంచుతాడు.దాని కాలికితగిలిన గాయానికి మందు ఆకుల రసాలతోవైద్యంకూడాచేస్తాడు, ఏ జీవినీ హింసించ రాదనే గురువాఃక్కు మేరకు. గురువును దింపను వచ్చినరాజసైనికులకు ఆపెద్దపులిని , గురు వాఙ్ఞమేరకు అప్పజెపుతాడు . 

అందరికీ గురువు అతడి నెందుకుఆశ్రమానికి రక్ష కునిగా నియమించారో తెల్సివచ్చి సిగ్గుతో తలలు వంచుకుంటారు. వినయం అన్నివేళలా గౌరవాన్ని అందిస్తుంది. ఓర్పేనేర్పును పెంచుతుంది.

   
Untitled Document